లాటరీ పేరుతో ఘరానా మోసం.. యువతిని మోసం చేసిన కేటగాడు

by  |
లాటరీ పేరుతో ఘరానా మోసం.. యువతిని మోసం చేసిన కేటగాడు
X

దిశ, కంటోన్మెంట్ : లాటరీ పేరిట ఓ యువతికి కుచ్చుటోపి పెట్టారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది.ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. పాత బోయిన్ పల్లి, మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన జడల మహేశ్వరి(25) జియో కంపెనీకి సంబంధించిన 83098 63745 నెంబరును వాడుతోంది. ఈ నెల 11వ తేదీన ఆమెకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి జియో కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు. ఆమె సెల్ నెంబరుకు రూ.25 లక్షల లాటరీ తగిలిందని నమ్మబలికాడు. సదరు మొత్తాన్ని ఆమె ఖాతాకు బదలాంచేందుకు గాను రూ.3 వేలను తమ ఖాతాలో జమ చేయాలని చెప్పాడు.

అతని మాటలను నమ్మన బాధితురాలు అతని సూచనల మేరకు అగంతకుడు ఇచ్చిన ఖాతాలో రూ.3 వేలను జమ చేసింది. ఇదే తరహాలో అతను చెప్పినప్పుడల్లా పలు సందర్భాల్లో బాధితురాలు వివిధ మార్గాల్లో మొత్తం రూ.37,400 లను జమ చేసింది. అయినప్పటికీ అగంతకుడు మరోమారు రూ.4 వేలను జమ చేయాలని, లేని పక్షంలో తన ఖాతా బ్లాక్ చేయబడుతుందని చెప్పాడు. అందుకు అంగీకరించిన బాధితురాలు తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పింది. అందుకు అతను ససేమిరా అనడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story