- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు కోలుకోవాలని ఉమ్మడి ప్రార్థనలు..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలు కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే, బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా గురువారం సాయంత్రం 6నుంచి 6.05వరకు ఎవరింట్లో వారు ప్రార్థనలు చేయనున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని ఆశించేవారంతా ఆయన పాటను ప్లే చేస్తూ, ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలు కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే, బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా గురువారం సాయంత్రం 6నుంచి 6.05వరకు ఎవరింట్లో వారు ప్రార్థనలు చేయనున్నారు.
బాలు త్వరగా కోలుకోవాలని ఆశించేవారంతా ఆయన పాటను ప్లే చేస్తూ, ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని తలైవా రజినీకాంత్ పిలుపునిచ్చారు. దీంతో సాయంత్రం జరిగే సామూహిక ప్రార్థనల్లో కమల్ హాసన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, థమన్ లాంటి ప్రముఖులంతా భాగం కానున్నారు. బాలు ఆరోగ్యం కోసం తాము చేసే పార్థనలను ఆ భగవంతుడు ఆలకిస్తారని రజినీకాంత్ తెలిపారు.
Next Story






