బ్రేకింగ్.. భారత్‌కు నీరవ్ మోదీ

72

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోట్లాది రూపాయలు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధమైంది. లండన్‌లో తలదాచుకున్న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూనైటెడ్ కింగ్ డమ్ హోం మినిస్టర్ అంగీకారం తెలిపినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పడు ఎట్టకేలకు నీరవ్ మోదీని ఇండియాకు తీసుకురావడంతో సీబీఐ అధికారులు సక్సెస్ అయ్యారు. త్వరలోనే నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే అవకాశముంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని గతంలో బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో బ్రిటన్ హోంమంత్రి త్వరలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..