ఒక్క క్లిక్.. ఆపిల్స్ అనుకుని బ్యాగ్ తెరిస్తే ఐఫోన్ వచ్చింది!

by  |
ఒక్క క్లిక్.. ఆపిల్స్ అనుకుని బ్యాగ్ తెరిస్తే ఐఫోన్ వచ్చింది!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఈ-మార్కెట్ వేగం పుంజుకుంది. దుకాణాలకు వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్ సౌకర్యంతో షాపింగ్ చేస్తున్నాం. దీంతో అటు సమయం ఇటు డబ్బులు రెండూ ఆదా అవుతున్నాయి. అదెలా అనుకుంటున్నారా..? ఆన్‌‌లైన్ వ్యాపారంలో పోటీతత్వం పెరగడంతో వినియోగదారులను అట్రాక్ట్ చేసుకునేందుకు ఆయా మార్కెటింగ్ సంస్థలు డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో పాటే రవాణా చార్జీలూ మిగులుతాయి. ఒక్క క్లిక్‌తో గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, చప్పల్స్‌తో పాటు ఇంట్లో, బయట వినియోగించే ప్రతీ వస్తువు ఇంటి ముందరకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు బ్రాండ్ కంపెనీలు ఆఫర్స్ పేరుతో వందల కోట్లు ఖర్చుచేయడంతో పాటు ప్రత్యేకమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.

తాజాగా యూనిటైడ్ కింగ్ డమ్(UK)కు చెందిన జేమ్స్ ఆన్‌లైన్ ద్వారా గ్రాసరీ దుకాణంలో బ్యాగ్ ఆపిల్స్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ చేసిన బ్యాగ్ అందజేయడంతో పాటు మీకు ఒక సర్‌ప్రైజ్ ఉందని చెప్పి వెళ్లిపోయాడు. ఇంట్లో్కి వెళ్లిన కస్టమర్ బ్యాగ్ ఓపెన్ చేసి నిజంగానే షాక్‌కు గురయ్యాడు. ఎందుకుంటే అతను బ్యాగ్ ఆపిల్స్ ఆర్డర్ చేస్తే అందులో ప్రపంచ మొబైల్ దిగ్గజం ‘ఆపిల్ ఎస్‌ఈ’ ఫోన్ వచ్చింది. దీంతో కస్టమర్ ఆనందానికి అవధుల్లేవు. అసలు విషయం ఎంటా అని ఆరా తీస్తే టెస్కో కంపెనీ ‘సూపర్ ప్రత్యామ్నాయాలు’ ప్రమోషన్‌లో భాగంగా 18 నుంచి 80 రకాల ఉత్పత్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జేమ్స్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

అంతకుముందు బ్యాగులో ప్యాకెట్ చూసి ‘ఈస్టర్ గుడ్డు లేదా సగం ధరకే తన ఆర్డర్ వచ్చిందని ఆశించాను.. కానీ, ఐఫోన్ చూశాక నిజంగా షాక్ అయ్యాను’ అని వివరించాడు. బహుళజాతి కిరాణ దుకాణ సంస్థ అయిన టెస్కో చైన్ మార్కెటింగ్‌ ‘సూపర్ సబ్‌స్టిట్యూట్’ అనే ప్రచార ఆఫర్‌లో భాగంగా ఉచిత ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్, సామ్‌సంగ్ ఫోన్లు, గాడ్జెట్స్ అందజేస్తోంది. అగ్రశ్రేణి సాంకేతిక ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేందుకు టెస్కో దుకాణదారులను ఎంపిక చేస్తోంది.



Next Story

Most Viewed