- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడ్జెట్‌లో తెలంగాణకు గుడ్ న్యూస్ ఉండబోతోంది: కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్(Union Budget 2026-2027)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. దేశ హితం, ప్రజల సంక్షేమం, దేశ రక్షణ కోసం బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తెలంగాణ మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు కూడా కేంద్రం నిధులు ఇవ్వబోతోందని చెప్పారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసేలాగే బడ్జెట్ ఉండబోతోందని వెల్లడించారు. అంతేగాకుండా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ సహకరించాలని అన్నారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉందని చెప్పారు. తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. దశాబ్దాల సంప్రదాయానికి తెర దించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రసంగంలో మార్పు చేసుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈసారి వార్షిక పద్దు (Union Budget 2026)లో పార్ట్-ఎ కంటే పార్ట్-బిపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు సమాచారం.
Read More..






