- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోటీన్ ఖర్చులకు అప్పులు చేస్తున్న రాష్ట్రాలు.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు వెల్లడి!
రాష్ట్రాలు ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు చేతికి అందిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రాలు ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు చేతికి అందిస్తున్నాయి. ఆ డబ్బులతో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం నుంచి బయటపడటమూ లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి దీర్ఘకాల పెట్టుబడులు, విద్య, వైద్యం, పట్టణ అభివృద్ధి, ఇంకా అనేక ఇతర మౌలికసదుపాయాలకు ఖర్చు పెట్టడానికి ఈ ఉచితాల వల్ల రాష్ట్రాల వద్ద నిధులు ఉండట్లేవు. కాబట్టి, ఈ ఉచిత పథకాలు సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించింది. అంతేకాదు, ఇవి అన్‌కండీషనల్‌గా అమలవుతున్న ఉచితపథకాలని, ఆ డబ్బులు ఉద్దేశించిన లక్ష్యానికి వాడాలనే నిబంధనలూ లేవని వివరించింది. ఒకసారి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాక.. మళ్లీ వాటిని రద్దు చేయడం రాజకీయ నష్టాలతో కూడిన నిర్ణయం కావడంతో ఈ పరిణామాలు జటిలంగా మారుతున్నాయని తెలిపింది. ఇదే సమయంలో ఎకనామిక్ సర్వే పలు సూచనలూ చేసింది. బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్‌లో ఇలాంటి ఉచిత పథకాలను కొన్ని షరతులు జోడించి అమలు చేసి.. సత్ఫలితాలు రాబడుతున్నాయని, కాబట్టి, మన దేశంలోని రాష్ట్రాలు కూడా అటువైపుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
తలకు మించిన భారం
రాష్ట్రాలు అభివృద్ధి, దీర్ఘకాల లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దగా నిధులు కేటయించలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాయని ఈ సర్వే వివరించింది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు అప్పుకు జీడీపీలో 28.1 శాతం, 62 శాతం జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, ఇన్సెంటివ్‌ల వంటివాటికే తప్పక ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని తెలిపింది ఇది రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని వివరించింది. ద్రవ్యలోటుతోపాటు వాణిజ్యలోటు కూడా ఏర్పడుతున్నదని పేర్కొంది. ఒక రాష్ట్రం మొత్తం వ్యయం, మొత్తం ఆదాయానికి మధ్యగల తేడాను ద్రవ్యలోటు అని, రోజువారీ ఖర్చులకూ ప్రభుత్వానికి రెగ్యులర్ ఇన్‌కమ్ రాకుంటే దాన్ని వాణిజ్య లోటుగా భావిస్తారు. అంటే ఆ రాష్ట్రం రోటీన్ ఖర్చులకూ అప్పులు చేస్తున్నట్టు లెక్క. మన దేశంలో పలు రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్టు సర్వే వివరించింది. మన దేశంలోని రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు 2022 ఆర్థిక సంవత్సరంలో 2.6 శాతం ఉండగా, 2025లో 3.2 శాతానికి పెరిగిందని తెలిపింది.
ఐదురెట్లు పెరిగిన ‘ఉచిత’ వ్యయాలు
2023 నుంచి 2026 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉచిత పథకాల కోసం రాష్ట్రాల వ్యయం ఐదు రెట్లు పెరిగాయని ఎకనామిక్ సర్వే పేర్కొంది. ఈ ఏడాది ఈ ఖర్చు రూ. 1.7 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. జీఎస్‌డీపీలో 0.19 శాతం నుంచి 1.25 శాతం వరకు ఉచితాలకు రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి. ఈ ఖర్చు 8.26 శాతం ఎస్‌జీడీపీ వరకూ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఉచిత పథకాలు అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చిందని తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక సహా పలురాష్ట్రాలు ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో మెజార్టీ రాష్ట్రాలు మహిళలు లబ్దిదారులుగా ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నట్టు సర్వే వివరించింది. అయితే, ఆ మహిళా సాధికారిత, లేదా వారి ఉపాధి పెరిగిన దాఖలాలూ పెద్దగా లేవని సర్వే పేర్కొనడం గమనార్హం. ఈ పథకాలు ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం అరుదుగా ఉన్నదని, ఇవే శాశ్వతంగా స్థిరమయ్యే ముప్పూ ఉన్నదని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రత్యామ్నాయమార్గాలు ఇవీ
ఈ ఉచిత పథకాలు అమలుచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు, సానుకూల ఫలితాలు సాధించడానికి ఎకనామిక్ సర్వే బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాలు అమలు చేస్తున్న షరతులతో కూడిన ఉచిత పథకాల విధానాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని సూచించింది. బ్రెజిల్ ప్రభుత్వం బోల్సా ఫెమీలియా పథకాన్ని పేదప్రజల కోసం అమలు చేస్తు్న్నదని, ఈ పథకం లబ్దిదారులకు కింద నగదు బదిలీ చేయడానికి కొన్ని షరతలను పెట్టిందని వివరించింది. ఉదాహరణకు పిల్లల స్కూల్ అటెండెన్స్, టీకాల షెడ్యూల్, మెంటల్ హెల్త్ చెకప్‌ల వంటి నిబంధనలు షరతులకు అనుగుణంగా ఉన్నాయా? లేదా అనేది పరిశీలిస్తారు. లబ్దిదారులను గుర్తించడానికి ఇలా సులువుగా పరీక్షించే విధానాలను అవలంభించి ఉచిత పథకాలను అమలు చేస్తున్నారని, ఒకవేళ స్కూల్ అటెండెన్స్ నిర్దేశిత స్థాయిలో లేకుంటే సదరు లబ్దిదారుడికి బోల్సా ఫెమీలియా కింద లబ్ది చేకూరదు. భారత్‌లో కూడా రాష్ట్రాలు ఇలాగే కండీషన్లు పెట్టి ఉచిత పథకాలు అమలు చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని వివరించింది.
Read More..






