- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ బడ్జెట్‌తో పేద, మధ్య తరగతికి ఒరిగిందేమీ లేదు: శశి థరూర్
కేంద్ర బడ్జెట్‌తో పేద, మధ్యతరగతికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఇటీవల సంవత్సరాలతో పోలిస్తే ఈసారి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం జరిగినట్టు అనిపించిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్‌తో పేద, మధ్యతరగతికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఇటీవల సంవత్సరాలతో పోలిస్తే ఈసారి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం జరిగినట్టు అనిపించిందన్నారు. బడ్జెట్ లో చాలా తక్కువ అంశాలు ప్రస్తావించారని చెప్పారు. పేదలు, మధ్యతరగతికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై బడ్జెట్ లో ఏమీ లేదన్నారు. రాష్ట్రాలకు అసలు నిధులు కేటాయించలేదన్నారు.
ఆర్థిక వికేంద్రీకరణ మారలేదని అనేక రాష్ట్రాల వద్ద వారి పౌరులు, ఓటర్ల కోసం కేటాయించడానికి నిధులు లేవనే విషయం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కేరళలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోసం దాదాపు 15ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నామని కానీ ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ స్థాపిస్తామని ప్రస్తావించినా అది ఎక్కడ అనేది చెప్పలేదన్నారు. ఆయుర్వేదానికి ప్రధాన కేంద్రంగా కేరళ ఉన్నప్పటికీ వారు అలాంటి హామీ ఇవ్వలేదన్నారు. కొబ్బరి, జీడిపప్పు గురించి ప్రస్తావించిన సమయంలోనూ కేరళ పేరు తీయలేదని అన్నారు.






