ఏప్రిల్ 1st నుంచి కొత్త ఐటీ చట్టం అమలు

by Gantepaka Srikanth |

సామాన్యులకు కేంద్ర తాజా బడ్జెట్‌తో భారీ ఉపశమనం లభించింది.

ఏప్రిల్ 1st నుంచి కొత్త ఐటీ చట్టం అమలు
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు కేంద్ర తాజా బడ్జెట్‌తో భారీ ఉపశమనం లభించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రాబోతోంది. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సామాన్యులు సైతం ఫైల్‌ చేసేలా మార్పులు చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గతేడాది (2025) బడ్జెట్‌లో రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో దానికి మించి పన్ను మినహాయింపులు ఉంటాయని వెల్లడైంది. ఇది పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేయడమే కాకుండా, పాత చట్టాల్లోని సంక్లిష్టతలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు.

Next Story