ప్రమాద బాధితులకు బడ్జెట్ ఊరట.. యాక్సిడెంట్ క్లెయిమ్ వడ్డీపై 'నో ట్యాక్స్'

by Malleboina Mahesh |   (  Updated:2026-02-01 07:13:06  IST  )

ప్రమాద బాధితులకు కేంద్ర బడ్జెట్ 2026- 27 లో భారీ ఊరట లభించింది. రోడ్డు ప్రమాదాలకు గురై కోర్టుల ద్వారా పరిహారం పొందే బాధితులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026 లో గొప్ప ఊరటనిచ్చింది.

ప్రమాద బాధితులకు బడ్జెట్ ఊరట.. యాక్సిడెంట్ క్లెయిమ్ వడ్డీపై నో ట్యాక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రమాద బాధితులకు కేంద్ర బడ్జెట్ 2026- 27 లో భారీ ఊరట లభించింది. రోడ్డు ప్రమాదాలకు గురై కోర్టుల ద్వారా పరిహారం పొందే బాధితులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026 లో గొప్ప ఊరటనిచ్చింది. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ (MACT) ద్వారా పొందే పరిహారంపై వచ్చే వడ్డీకి (Interest) ఇకపై ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ వడ్డీ ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

గతంలో ఈ వడ్డీ మొత్తం ఒక పరిమితి దాటితే దానిపై టీడీఎస్ (TDS) మినహాయించేవారు. అయితే, తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ప్రమాద బాధితులకు ఇచ్చే ఈ వడ్డీపై టీడీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. "ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు న్యాయపరంగా లభించే వడ్డీపై పన్ను భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం" అని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల బాధితులకు కోర్టు కేటాయించిన పూర్తి నిధులు ఎటువంటి కోత లేకుండా నేరుగా అందుతాయి. ఈ నిర్ణయం ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం గా మారనుంది.

Read More..

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షలు తప్పింపు

Next Story