ప్రతి రంగానికి సాధికారత కల్పించడానికి ఇది స్పష్టమైన బ్లూప్రింట్.. బడ్జెట్ పై అమిత్ షా

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-01 08:14:02  IST  )

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై అధికారంలో ఉన్న బీజేపీ ప్రశంసలు కురిపిస్తే కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తోంది.

ప్రతి రంగానికి సాధికారత కల్పించడానికి ఇది స్పష్టమైన బ్లూప్రింట్.. బడ్జెట్ పై అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై అధికారంలో ఉన్న బీజేపీ ప్రశంసలు కురిపిస్తే కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తోంది. తాజాగా బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎక్స్ లో అమిత్ షా.. ఈ బడ్జెట్ ద్వారా ప్ర‌ధానమంత్రి మోడీ స్వావ‌లంబ‌న మ‌రియు అభివృద్ధి చెందిన భార‌త‌దేశం కేవ‌లం నినాదం కాద‌ని, ప్ర‌భుత్వ సంక‌ల్పం అని నిరూపించార‌న్నారు. ఈ బడ్జెట్ ప్రతి రంగానికి, ప్రతి తరగతికి మరియు ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడానికి స్పష్టమైన బ్లూప్రింట్‌ను అందించిందన్నారు. అంతే కాకుండా ప్రతి అడుగులో వారికి సహాయపడే ప్రోత్సాహాన్ని అందించడానికి ఒక పునాది దార్శనికతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. #ViksitBharatBudget అనేది ప్రతి రంగంలోనూ ప్రపంచ అగ్రస్థానంలో ఉండే భారతదేశాన్ని నిర్మించడానికి ఒక దార్శనికత అని కొనియాడారు.

Read More..

సమస్యలు చక్కదిద్దే ప్రయత్నం ఒక్కటి కూడా లేదు: ఖర్గే విమర్శలు

Next Story