ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి భారీ ఊతం

by Thanuru Gopichand |   (  Updated:2026-02-01 06:20:53  IST  )

దేశీయంగా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 10వేల కోట్లతో ఎస్ఎంఈ (SME) గ్రోత్ ఫండ్ (Growth Fund) ఏర్పాటును ప్రతిపాదించిన కేంద్రం.

ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి భారీ ఊతం
X

దిశ, వెబ్ డెస్క్ : బడ్జెట్ ​2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈ (MSME) రంగానికి పెద్దపీట వేసింది. దేశీయంగా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 10వేల కోట్లతో ఎస్ఎంఈ (SME) గ్రోత్ ఫండ్ (Growth Fund) ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది వర్ధమాన సంస్థలు భవిష్యత్తులో పారిశ్రామిక దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. అలాగే, మైక్రో ఎంటర్‌ప్రైజెస్ (Micro Enterprises) కోసం రూ. 2వేల కోట్లతో 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్' ద్వారా మద్దతు ప్రకటించింది. రాష్ట్రాల్లో మూడు అత్యాధునిక కెమికల్ పార్కుల ఏర్పాటుతో పాటు, రాబోయే ఐదేళ్లలో కంటైనర్ తయారీ రంగానికి రూ. 10వేల కోట్లు కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పనలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఫైబర్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నేషనల్ ఫైబర్ స్కీమ్ను (National Fibre Scheme) ప్రవేశపెట్టడం విశేషం. ఈ చర్యలన్నీ కేవలం పారిశ్రామిక వృద్ధికి మాత్రమే కాకుండా, కోట్లాది మందికి ఉపాధినిచ్చే లేబర్-ఇంటెన్సివ్ రంగాలను బలోపేతం చేయడానికి దోహదపడతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Read More..

Budget2026: రవాణా రంగంలో విప్లవం.. కొత్త ఫ్రైట్ కారిడార్లు, 20 జలమార్గాలు

Next Story