Union Budget 2025: AI అభివృద్ధికి రూ.500 కోట్లు

by Yella Dhawani Reddy |

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏఐ (Artificial intelligence)కు పెద్ద పీట వేశారు.

Union Budget 2025: AI అభివృద్ధికి రూ.500 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏఐ (Artificial intelligence)కు పెద్ద పీట వేశారు. AI అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌తో మనదేశం సాంకేతిక, విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ మొత్తం కేటాయించినట్లు తెలిపారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే 2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర పట్టణాలకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మూడు ఎక్సలెన్స్ సెంటర్లు ప్రకటించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఇంకా టెక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్ పాత్రను దృష్టిలో పెట్టుకుని దాదాపు 6500 మంది అదనపు విద్యార్థులకు IITలలో మౌలిక సదుపాయాలు విస్తరించేలా ప్రభుత్వం యోచిస్తోందని ప్రకటించారు.

Next Story