- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Budget 2025-26: బడ్జెట్‌లో రంగాల వారీగా కేటాయింపులు ఇవే
కేంద్రంలో ఎన్డీయే కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) 8వ సారి పూర్తి స్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఎన్డీయే కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) 8వ సారి పూర్తి స్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు బడ్జెట్‌లో రంగాల వారీగా కేటాయింపులు చేశారు. ఇప్పుడు అవేంటో చూద్దాం..
* రక్షణ శాఖ రూ.4,91,732 కోట్లు
* గ్రామీణాభివృద్ధి రూ.2,66,817 కోట్లు
* హోం శాఖ రూ.2,33,211 కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలు రూ.1,71,437 కోట్లు
* విద్య రూ.1,28,650 కోట్లు
* ఆరోగ్యం రూ.98,311 కోట్లు
* పట్టణాభివృద్ది రూ.96,777 కోట్లు
* ఐటీ, టెలికాం రూ.95,298 కోట్లు
* విద్యుత్ రూ.81,174 కోట్లు
* వాణిజ్యం, పరిశ్రమలు రూ.65,553 కోట్లు
* సామాజిక సంక్షేమం రూ.60,052 కోట్లు
బడ్జెట్‌లో హైలైట్స్..
* కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.
* గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా.
* వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట.
* 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు.
* బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు.
* వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు.
* కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.
తొలిసారి రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్
* 2025-26 మొత్తం బడ్జెట్ రూ. 50,65,345 కోట్లు
* రెవెన్యూ వసూళ్లు రూ. 34,20,409 కోట్లు
* మూల ధన వసూళ్లు రూ. 16,44,936 కోట్లు
* అప్పులు, ఇతర వసూళ్లు రూ. 15,68,936
* GDPలో ఆర్థిక లోటు 4.8 శాతం
* ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం రూ.42. 70 లక్షల కోట్లు
* రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్ను వసూళ్లు రూ. 28.37 లక్షల కోట్లు
* పన్నుయేతర ఆదాయం రూ. 5.83 లక్షల కోట్లు
* 2025-26 ద్రవ్య లోటు 4.4 శాతంగా అంచనా






