బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-01 07:46:05  IST  )

2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా TDS, TCS రేట్లను తగ్గించినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అలాగే సీనియర్ సిటిజన్లకు నిర్మలమ్మ భారీ ఉపశమనం కలిగించారు. సీనియర్‌ సిటిజన్లకు వడ్డీపై వచ్చే ఆదాయంపై TDS పరిమితిని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే అద్దెలపై వచ్చే ఆదాయంపై TDSను రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు. ఇక, ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్‌డేటెడ్‌ రిటర్నులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాల పరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు TCSను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story