- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిశ్చిత పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్తున్నాం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్‌కు ముందు లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందని అన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నట్లు తెలిపారు. సంస్కరణలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏడు శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లతో మమేకమై ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం సంతోషాన్నిస్తోందని అన్నారు. 'వికసిత్ భారత్' ఆకాంక్షలకు అనుగుణంగా పేదరిక నిర్మూలన, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, నైపుణ్యం కల్పించి అర్థవంతమైన ఉపాధి సృష్టి, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంపు లాంటి లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రధానాంశాలుగా పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు సాధికారత కల్పించే విధంగా పది లక్ష్యాలను నిర్దేశించుకుని బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు.






