కేంద్రమంత్రి ఇంట్లో విషాదం నింపిన కరోనా

by  |
Gehlot daughter Yogita Solanki
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులూ అనేకమంది వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. తాజాగా.. కరోనా మహమ్మారి కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం నింపింది. ఇటీవల వైరస్ సోకిన కేంద్రమంత్రి గెహ్లాత్ కూతురు యోగితా సోలంకి(44) కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే.. కూతురి మరణానికి సంబంధించి మంత్రి గెహ్లాత్ కార్యాలయం ఈ మేరకు వివరాలను విడుదల చేసింది.

రెండు వారాల క్రితం కొవిడ్ లక్షణాలతో బాధపడిన యోగితాను ఉజ్జయినిలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం టెస్టులు చేయగా, ఆర్టీ-పీసీఆర్‌లో నెగటివ్ వచ్చింది. కానీ లక్షణాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమెకు సీటీ స్కాన్ నిర్వహించగా షాకింగ్ రిపోర్టు బయటపడింది. అప్పటికే యోగిత ఊపిరితిత్తులు 90 శాతం డ్యామేజ్ అయినట్లు తేలింది. దీంతో ఆమెను హుటాహుటిన ఇండోర్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే యోగిత అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వచ్చాయి. వీటన్నిటికీ తోడు బ్లడ్ క్లాట్స్ కారణంగా గుండెపోటు రావడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కన్నుమూశారు. కేంద్ర మంత్రి కూతురి మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాలు తెలిపారు.



Next Story

Most Viewed