కేంద్రమంత్రి రవిశంకర్‌‌కు తప్పిన ప్రమాదం !

24

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ప్రమాదం తప్పింది. బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి కేంద్రమంత్రి తృటిలో తప్పించుకున్నారు. శనివారం లౌఖా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని పాట్నా ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా హెలికాప్టర్ రెక్కలు సమీపంలోని విమానానశ్రయ వైరింగ్‌కు తాకడంతో విరిగిపోయాయి. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కేంద్రమంత్రి వెల్లడించారు.