- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీల్లో ప్రవేశాలకు నిబంధనల సడలింపు
by Shamantha N |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జేఈఈ అడ్వాన్స్ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్ స్పష్టతనిచ్చారు. కొవిడ్ కారణంగా గతంలో ఇబ్బందులు పడ్డారని, ఈ సారి అలాంటిదేమీ ఉండకూడదని ఆశించారు. కరోనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని… జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులు 75% మార్కులు కలిగి ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది సడలిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు ఇంటర్‌లో 75శాతం మార్కులు ఉంటేనే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత లభించేది. ఈ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: జేఈఈ అడ్వాన్స్ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్ స్పష్టతనిచ్చారు. కొవిడ్ కారణంగా గతంలో ఇబ్బందులు పడ్డారని, ఈ సారి అలాంటిదేమీ ఉండకూడదని ఆశించారు. కరోనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని… జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులు 75% మార్కులు కలిగి ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది సడలిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు ఇంటర్‌లో 75శాతం మార్కులు ఉంటేనే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత లభించేది. ఈ నిబంధనను ఇప్పుడు అమలు చేయడంలేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. 2021 జూలై 3న జేఈఈ అడ్వాన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
Next Story






