మహిళలు స్వయం శక్తితో ఎదగాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by  |
Union Minister Kishan Reddy
X

దిశ, అంబర్ పేట్: మహిళలు స్వయం శక్తితో ఎదగాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ ఆధ్వరంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన 300 మహిళలకు సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, కార్పొరేటర్లు పద్మా వెంకట్ రెడ్డి, అమృత, కన్నె ఉమారాణి, మహాలక్ష్మి, చుక్క జగన్, అజయ్ కుమార్, శ్యామ్ రాజ్ పాల్గొన్నారు.


Next Story