- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాళ్లు కట్టి వృద్ధురాలిని బావిలో పడేసిన దుండగులు
<p>దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లంగారి లక్ష్మి(75) మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో సీరియల్ చూడటం కోసం పెద్ద కొడుకు ఇంటికి వెళ్లింది. సీరియస్ చూసిన అనంతరం తిరిగి ఇంటికెళ్తానని అక్కడినుంచి బయలుదేరింది. బుధవారం తెల్లవారినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుమారుడు ఇంటిచుట్టుపక్కల మొత్తం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామ మొత్తం జల్లెడ పట్టగా, నాలుగురోజుల తర్వాత […]</p>

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లంగారి లక్ష్మి(75) మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో సీరియల్ చూడటం కోసం పెద్ద కొడుకు ఇంటికి వెళ్లింది. సీరియస్ చూసిన అనంతరం తిరిగి ఇంటికెళ్తానని అక్కడినుంచి బయలుదేరింది. బుధవారం తెల్లవారినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుమారుడు ఇంటిచుట్టుపక్కల మొత్తం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామ మొత్తం జల్లెడ పట్టగా, నాలుగురోజుల తర్వాత గ్రామంలోని పాత బావిలో శవమై తేలింది. ఆమెను దారుణంగా హత్య చేసి, శరీరానికి బండరాళ్లు కట్టి బావిలో పడేసినట్లు గుర్తించారు. అనంతరం బావిలోంచి వెలికి తీయగా, ఆమె ఒంటిపై బంగారం కనిపించలేదు. దీంతో నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






