కళ్లలో కారం కొట్టి.. పోలీసులపై దాడి

69

దిశ, ఆసిఫాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గత రెండురోజుల నుండి జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపెళ్లిలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు విరమింప చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది పోలీసులకు తీవ్ర గాయాలవడంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..