షెడ్‎లో గుర్తు తెలియని మృతదేహం

42

దిశ, వెబ్‎డెస్క్: వికారాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ షెడ్‎లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం షెడ్‎లో మృతదేహాన్ని గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరనే విషయాలు తెలియరాలేదు.