- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఊహించని షాక్.. ఝలకిచ్చిన ఈడీ
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలు( డ్రగ్స్) కేసు హాట్ టాపిక్‌గా మారింది. రోజుకో కీలక మలుపు తిరుగుతూ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తోంది. నిన్న పూరి జగన్నాథ్‌ను విచారించిన ఈడీ.. నేడు సినీ నటి ఛార్మి కౌర్‌ని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఉన్న మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరుకాలేనని లేఖ రాసింది. రకుల్‌ను ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన […]</p>

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలు( డ్రగ్స్) కేసు హాట్ టాపిక్‌గా మారింది. రోజుకో కీలక మలుపు తిరుగుతూ ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తోంది. నిన్న పూరి జగన్నాథ్‌ను విచారించిన ఈడీ.. నేడు సినీ నటి ఛార్మి కౌర్‌ని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఉన్న మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరుకాలేనని లేఖ రాసింది. రకుల్‌ను ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని ఈడీకి లేఖ రాసింది. ఆ తేదీ కాకుండా మరో తేదీని ఇవ్వాలని అధికారులను కోరింది.
అయితే రకుల్ రిక్వెస్ట్‌ని ఈడీ తిరస్కరించింది. ఈనెల 6న ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. మరో తేదీ ప్రకటించడం కుదరదని, ముందుగా నిర్ణయించిన సమయానికే రావాలని రకుల్ లేఖకు రిప్లై ఇచ్చారు.






