స్కూటీపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌కు ఊహించని ప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, జవహర్‎నగర్: ఓ మహిళా కానిస్టేబుల్ మౌలాలి ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా.. స్కూటీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోస్న ఆదివారం రాత్రి విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో మౌలాలి ఫ్లై ఓవర్ పైకి చేరుకోగానే.. ఒక్కసారిగా రన్నింగ్‌లో ఉన్న స్కూటీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన [&hellip;]</p>

స్కూటీపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌కు ఊహించని ప్రమాదం
X

దిశ, జవహర్‎నగర్: ఓ మహిళా కానిస్టేబుల్ మౌలాలి ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా.. స్కూటీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోస్న ఆదివారం రాత్రి విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో మౌలాలి ఫ్లై ఓవర్ పైకి చేరుకోగానే.. ఒక్కసారిగా రన్నింగ్‌లో ఉన్న స్కూటీ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన జ్యోస్న వాహనం మీద నుంచి దూకేసింది. ఇదే సమయంలో మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

Next Story