నిరుద్యోగుల ట్విట్టర్ వార్.. ఆ హాష్‌టాగ్‌తో ఉద్యమం

by  |
Unemployed Twitter War
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు చేస్తు్న్న ఉద్యమం రోజురోజుకూ పెరిగి పోతోంది. ట్విట్టర్ వేదికగా మరోసారి నిరుద్యోగుల తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ‘ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు- మేలుకోండి నిరుద్యోగులారా’ అన్న నినాదంతో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటివరకు ట్విట్టర్‌లో నాలుగు క్యాంపెయిన్‌లు పూర్తి చేసుకోగా, ఒక్కో క్యాంపెయిన్‌లో ఒక్కో హాష్ టాగ్‌తో ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలను ప్రపంచానికి చాటేలా జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి, గ్రాడ్యుయేట్ తమ గోడును ట్వీట్ల ద్వారా వినిపించాలంటూ పిలుపునిస్తున్నారు. వాట్సప్ గ్రూపుల ద్వారా జరుగుతున్న కార్యాచరణ రోజు రోజుకూ ఉధృతమవుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సోషల్ మీడియాలో క్యాంపెయిన్-5 చేపట్టేందుకు సిద్ధమమైనట్లు ప్రకటించారు. దీనికోసం అన్ని జిల్లాల నుంచి చురుకుగా పనిచేసే వారిని గుర్తించి ఆయా జిల్లాల్లోని యువతీయువకులందరినీ సమాయత్తం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఇకపై ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దని, కొట్లాడి నోటిఫికేషన్లు సాధిద్దామని ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపుతున్నారు.


Next Story

Most Viewed