ట్విట్టర్‌లో నిరుద్యోగల వార్.. దెబ్బకు బ్లాక్ చేస్తోన్న కేటీఆర్

349

దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులంతా వేచిచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలో నోటిఫికేషన్లు అంటూ సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ ఉండటంతో.. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిరుద్యోగులంతా వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కొన్ని రోజుల క్రితం వందల మంది యువకులు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ పూర్తయిందన్న వార్తల నేపథ్యంలో నిరుద్యోగులు మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ముందుకొచ్చారు. అయితే ఈసారి ట్విట్టర్లో కేటీఆర్ ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.

 

కేటీఆర్‌ని ట్యాగ్ చేస్తూ వరుసకట్టి ట్వీట్ లు చేస్తున్నారు. #kcrwherearejobnotifications అనే హ్యాష్ టాగ్‌తో కేటీఆర్‌కి వస్తున్న ట్వీట్లకు మంత్రి విసిగిపోయారు. చేసేదేమి లేక ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పందించలేక ట్విట్టర్లో బ్లాక్ చేస్తున్నారంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడతున్నారు. ఏది ఏమైనా తమ ఉద్యమం ఆగదంటూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఓ నిరుద్యోగి చేసిన ట్వీట్ ‘‘ Trying to suppress the Voice of #Telangana Youth @KTRTRS do you know the working people of Pressure Cooker?, Its will burst when it cannot bear the pressure any more, Listen to the problems of the people and solve the issues,dont try to escape from it ’’ అని ఉంది. అంటే రాష్ట్రంలోని నిరుద్యోగుల గొంతుకను అనిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ మీకు ప్రెషర్ కుక్కర్ గురించి  తెలుసు కదా.. ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిపోతుందో అప్పడు అది పేలిపోతుంది. అందుకే ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించండి కానీ, తప్పించుకోవడానికి ప్రయత్నించకండి అని ట్వీట్ సారాంశం. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజన్లు ట్విట్టర్లో భారీ ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు.

 

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..