‘అంకుల్‌ జీ.. ఇంకో జాబ్ చూసుకోండి’

by Shamantha N |

<p>కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింస పెరిగిందని, పరిస్థితులు దిగజారాయని రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ లీడర్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ జగ్దీప్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ, బెంగాల్‌లో పరిస్థితులు మెరుగవ్వాలంటే ఆయన ఢిల్లీకి వెళ్లి కొత్త జాబ్ చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, రెండు సూచనలూ చేశారు. ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయడంలో సీఎం అజయ్ బిష్త్ [&hellip;]</p>

‘అంకుల్‌ జీ.. ఇంకో జాబ్ చూసుకోండి’
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింస పెరిగిందని, పరిస్థితులు దిగజారాయని రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ లీడర్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ జగ్దీప్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ, బెంగాల్‌లో పరిస్థితులు మెరుగవ్వాలంటే ఆయన ఢిల్లీకి వెళ్లి కొత్త జాబ్ చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, రెండు సూచనలూ చేశారు. ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయడంలో సీఎం అజయ్ బిష్త్ యోగికి సలహాదారుగా, లేదా మహమ్మారి కాలంలో పకడ్బందీగా దాక్కోవడానికి హోం మంత్రికి అడ్వైజర్‌గా ఉండొచ్చని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఓఎస్‌డీలుగా బంధువులను నియమించుకున్నారనే ఆరోపణలూ చేశారు. అంకుల్ జీ అని పేర్కొంటూ ఢిల్లీ వెళ్లడంపై ఆలోచించినప్పుడూ పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో సెటిల్ చేసిన ఆయన కుటుంబాన్నీ వెంట తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

Next Story