కూకట్‌పల్లి కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం..

by Shyam |   (  Updated:2020-12-04 01:17:02  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ 63వ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ ఏజెంట్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఓటింగ్ జరిగిన రోజు 355 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారని, కానీ ఇవాళ బ్యాలెట్ బాక్సులో 574 ఓట్లు ఉన్నాయంటూ వారు ఆందోళనకు దిగారు. సీల్ వేయని బ్యాలెట్ బాక్సులో ఉన్న ఓట్లను పోలింగ్ ఏజెంట్లు లెక్కిస్తున్నారిని వారితో గొడవకు దిగారు. [&hellip;]</p>

కూకట్‌పల్లి కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం..
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ 63వ కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ ఏజెంట్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఓటింగ్ జరిగిన రోజు 355 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారని, కానీ ఇవాళ బ్యాలెట్ బాక్సులో 574 ఓట్లు ఉన్నాయంటూ వారు ఆందోళనకు దిగారు. సీల్ వేయని బ్యాలెట్ బాక్సులో ఉన్న ఓట్లను పోలింగ్ ఏజెంట్లు లెక్కిస్తున్నారిని వారితో గొడవకు దిగారు.

దీంతో పోలింగ్ ఏజెంట్లు, బీజేపీ ఏజెంట్ల మధ్య కాసేపు వాగ్వివాదం నెలకొంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బీజేపీ ఏజెంట్లను బయటకు పంపించి వేశారు. పోలింగ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాషాయ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరపించాలని, అప్పటివరకు కౌంటింగ్ నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story