116కు చేరిన యూకే వేరియంట్ కేసులు

49

న్యూఢిల్లీ: దేశంలో యూకే వేరియంట్‌ కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య తాజాగా 116కి చేరింది. యూకే వేరియంట్ జీనోమ్‌ సోకిన భారతీయుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు రిపోర్ట్ అయ్యాయని, శుక్రవారం ఈ కేసుల సంఖ్య 114గా ఉన్నదని వివరించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..