రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న ప్రధాని..

by  |
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న ప్రధాని..
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రేయసి క్యారీ సైమండ్స్‌ను ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహమాడారు. వెస్ట్ మినిస్టర్ కేథడ్రాల్‌లో రహస్యంగా ప్రధాని బోరిస్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి కేవలం 30 మంది మాత్రమే హాజరైనట్టు సమాచారం. ప్రధాని ఆఫీసు సిబ్బందికి కూడా తెలియకుండా ఆయన పెళ్లి చేసుకోవడం గమనార్హం. అయితే, నిన్న బోరిస్ జాన్సన్, క్యారీ పెళ్లి చేసుకున్నట్టు బ్రిటన్ పత్రికలు ఈరోజు వెల్లడించాయి. క్యారీ సైంమడ్స్‌కు ఇది మొదటి వివాహం కాగా.. బోరిస్‌కు ఇది మూడో వివాహం. మొదటి, రెండో భార్య నుంచి బోరిస్ విడాకులు పొందారు. కాగా బోరిస్, క్యారీ 2018 నుంచి కలిసే ఉంటున్నారు. ఇప్పటికే బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్‌కు ఏడాది బాలుడు ఉన్నాడు.



Next Story

Most Viewed