- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు యువకుల హత్య
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జేగురుగొండ-చింతలనార్ నడుమ మిల్లంపల్లి సమీపంలో రోడ్డుపై ఇద్దరు యువకుల మృతదేహాలను సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతులు మదకం అర్జున్, తాతి హిడ్మాలుగా గుర్తించారు. మృతదేహాల పక్కన కరపత్రాలు పడేశారు. ఆదివారం అర్థరాత్రి ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఎస్‌పికే ఎల్ ధృవ్ ధృవీకరించారు. ఈ ఇద్దరు యువకులను వేరే చోట హత్య చేసి మృతదేహాలను రోడ్డు […]</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జేగురుగొండ-చింతలనార్ నడుమ మిల్లంపల్లి సమీపంలో రోడ్డుపై ఇద్దరు యువకుల మృతదేహాలను సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతులు మదకం అర్జున్, తాతి హిడ్మాలుగా గుర్తించారు. మృతదేహాల పక్కన కరపత్రాలు పడేశారు.
ఆదివారం అర్థరాత్రి ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఎస్‌పికే ఎల్ ధృవ్ ధృవీకరించారు. ఈ ఇద్దరు యువకులను వేరే చోట హత్య చేసి మృతదేహాలను రోడ్డు పక్కన పడేసినట్లుగా భావిస్తున్నారు. వీరు గతంలో సల్వాజుడుంలో పనిచేశారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. జేగురుగొండ ఏరియా కమిటీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Next Story






