వాగు దాటుతుండగా ఇద్దరు యువతులు గల్లంతు..

by Batti.Sumithra |   (  Updated:2021-08-30 06:27:37  IST  )

<p>దిశ, యాదగిరిగుట్ట: సోమవారం రోజు రాజపేట మండలంలోని రాజపేట-కుర్రారం గ్రామాల మధ్యన గల దోసల వాగులో బైక్‌పై వస్తున్న ఇద్దరు గల్లంతు అయ్యారు. ఇటికలపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి స్కూటీ పై ఇద్దరు అమ్మాయిలు సింధూజ, హిమ బిందులతో పాటు మరో యువకుడు వెళ్తుండగా వాగు నీటి ప్రవాహనికి కొట్టుకుపోయారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో యువకుడు దొరకగా, [&hellip;]</p>

flood effect
X

దిశ, యాదగిరిగుట్ట: సోమవారం రోజు రాజపేట మండలంలోని రాజపేట-కుర్రారం గ్రామాల మధ్యన గల దోసల వాగులో బైక్‌పై వస్తున్న ఇద్దరు గల్లంతు అయ్యారు. ఇటికలపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి స్కూటీ పై ఇద్దరు అమ్మాయిలు సింధూజ, హిమ బిందులతో పాటు మరో యువకుడు వెళ్తుండగా వాగు నీటి ప్రవాహనికి కొట్టుకుపోయారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో యువకుడు దొరకగా, ఇద్దరు అమ్మాయిల ఆచూకీ తెలియాల్సి ఉంది.

Next Story