షాకింగ్.. రాత్రి విందుకు పిలిచి.. అశ్లీలంగా వీడియోలు తీసి..

by  |
షాకింగ్.. రాత్రి విందుకు పిలిచి.. అశ్లీలంగా వీడియోలు తీసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈజీగా డబ్బులు సంపాదించుకునేందుకు కొంత మంది యువతులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హనీట్రాప్ కేసులు బయటకు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే కర్నాటకలోని మంగుళూరులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మంగుళూర్‌లోని ఉళ్లాల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సప్నా, అఫ్రీన్ అనే యువతులు నివాసం ఉంటున్నారు. వారి పక్క ఫ్లాట్‌లో ఓ వ్యాపారవేత నివస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న సదరు వ్యాపారవేత్తను యువతులు రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు.

ఆ రోజున అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో సప్నా అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. ఒక్కసారిగా షాకైన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారవేత్త ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Next Story

Most Viewed