- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి
by Shyam |
<p>దిశ, సూర్యాపేట: వేలాడుతున్న సర్వీస్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే… రామాపురం గ్రామానికి చెందిన పాలేటి రాము(32) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయబావి వద్ద మోటారు బిగించేందుకు స్థానిక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కొట్టే గోపి(23)ను తీసుకెళ్లాడు. మోటార్ బిగించిన అనంతరం సర్వీస్ వైర్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ […]</p>

X
దిశ, సూర్యాపేట: వేలాడుతున్న సర్వీస్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో ఆదివారం జరిగింది. వివరాళ్లోకి వెళితే… రామాపురం గ్రామానికి చెందిన పాలేటి రాము(32) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయబావి వద్ద మోటారు బిగించేందుకు స్థానిక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కొట్టే గోపి(23)ను తీసుకెళ్లాడు. మోటార్ బిగించిన అనంతరం సర్వీస్ వైర్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






