గడువు తర్వాత ప్రచారం చేస్తే రెండేండ్లు జైలు శిక్ష: ఎస్ఈసీ

by  |
గడువు తర్వాత ప్రచారం చేస్తే రెండేండ్లు జైలు శిక్ష: ఎస్ఈసీ
X

దిశ, వెబ్ డెస్క్: గడువు ముగిసిన తర్వాత ప్రచారం చేస్తే రెండేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఎన్నికల బరిలో టీఆర్ఎస్ నుంచి150, బీజేపీ-149, కాంగ్రెస్-146, టీడీపీ-106, ఎంఐఎం-51, సీపీఐ-17, సీపీఎం-12, స్వతంత్రులు-415, ఇతరులు-76 మంది ఉన్నట్టు తెలిపారు. మొత్తం 36,404 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం 18,202 బ్యాలెట్ బాక్సులను ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం 2629 దరఖాస్తులు అందాయని చెప్పారు.

డిసెంబర్ 1న ఉదయ ఏడు గంటలకు ఎన్నికలు ప్రారంభం అవుతాయనీ…ఉదయం గం. 5.30 వరకు సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ఉండాలని తెలిపారు. ఉదయం 6 గంటల్లోగా పోలింగ్ ఏజెంట్లు హాజరు కావాలని చెప్పారు. కోవిడ్ -19 పాజిటివ్ బాధితులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోసం 52,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పోలింగ్ పర్య వేక్షణకు 661 మంది జోన్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ప్రతీ సర్కిల్‌కు ఇద్దరు ఫ్లై యింగ్ స్క్వాడ్ ఉంటారని చెప్పారు.


Next Story