- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : గంజాయిని విక్రయించేందుకు నగరానికి వచ్చిన ఇద్దరు మహిళలను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన మామిడి రత్నం, నాగ వెంకట కృష్ణవేణిలు గంజాయిని విక్రయించేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. నగరంలోని వినియోగదారులకు విక్రయించేందుకు విశాఖ నుంచి తమ వెంట18 కేజీల గంజాయిని తీసుకొచ్చారు. కాగా దీనిపై మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందింది. నాచారం వద్ద వినియోగదారుల కోసం గంజాయితో ఎదురు చూస్తుండగా వారిని […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : గంజాయిని విక్రయించేందుకు నగరానికి వచ్చిన ఇద్దరు మహిళలను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన మామిడి రత్నం, నాగ వెంకట కృష్ణవేణిలు గంజాయిని విక్రయించేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. నగరంలోని వినియోగదారులకు విక్రయించేందుకు విశాఖ నుంచి తమ వెంట18 కేజీల గంజాయిని తీసుకొచ్చారు.
కాగా దీనిపై మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందింది. నాచారం వద్ద వినియోగదారుల కోసం గంజాయితో ఎదురు చూస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 18 కేజీల గంజాయితో పాటు రూ.28 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నాచారం పోలీసులకు అప్పగించినట్టు ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
Next Story






