నెల్లూరు జిల్లాలో వరుస హత్యల కలకలం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. 24 గంటల్లో ఇద్దరు మహిళలను హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆదివారం నెల్లూరు రూరల్ పరిధిలో నాలుగవ మైలులో జరిగింది. వివరాల ప్రకారం&#8230; రామ తీర్థానికి చెందిన కోమారి నాగేశ్వరరావు నాలుగో మైలు నవలాకుల తోట వద్ద గత 15 నెలల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. భార్య నిర్మలమ్మ ప్రవర్తనపై నాగేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. [&hellip;]</p>

నెల్లూరు జిల్లాలో వరుస హత్యల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపాయి. 24 గంటల్లో ఇద్దరు మహిళలను హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఆదివారం నెల్లూరు రూరల్ పరిధిలో నాలుగవ మైలులో జరిగింది.

వివరాల ప్రకారం… రామ తీర్థానికి చెందిన కోమారి నాగేశ్వరరావు నాలుగో మైలు నవలాకుల తోట వద్ద గత 15 నెలల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. భార్య నిర్మలమ్మ ప్రవర్తనపై నాగేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. అలాగే తమ దూరపు బంధువు రామతీర్థం కి చెందిన వెంకటరత్నం ప్రవర్తన కూడా అతనికి నచ్చేది కాదు.

వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంపై… నాగేశ్వరరావు దంపతుల మధ్య గత కొంతకాలంగా కలహాలు నడుస్తున్నాయి. దీంతో తన భార్య నిర్మలమ్మను, వెంకటరత్నంను దారుణంగా హత్య చేశాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే నాగేశ్వరరావు తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆమె మొండెం నుంచి తలను వేరు చేశాడు. అత్యంత దారుణంగా ఈ ఘటన జరిగింది.

కాగా ఇదే నివాసంలో పైన ఉంటున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Next Story