- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్ట్
<p>దిశ, జనగామ: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు ఇన్‌చార్జీ సీఐ సంతోష్ తెలిపారు. శుక్రవారం జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఠా వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన కే.నాగరాజు, బి.నరేష్, ఎన్.ప్రతాప్, జె.సతీష్, బి.విజయ్ చంద్ర, జి.రోహిత్, ఎవెన్, జి.మనోజ్ జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరంతా హైదరాబాద్, కరీంనగర్, యాదాద్రి జిల్లాలో తొమ్మిది బైక్‌లు దొంగిలించారు. గురువారం సాయంత్రం ఎస్ఐ […]</p>

దిశ, జనగామ:
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు ఇన్‌చార్జీ సీఐ సంతోష్ తెలిపారు. శుక్రవారం జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఠా వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన కే.నాగరాజు, బి.నరేష్, ఎన్.ప్రతాప్, జె.సతీష్, బి.విజయ్ చంద్ర, జి.రోహిత్, ఎవెన్, జి.మనోజ్ జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరంతా హైదరాబాద్, కరీంనగర్, యాదాద్రి జిల్లాలో తొమ్మిది బైక్‌లు దొంగిలించారు. గురువారం సాయంత్రం ఎస్‌ఐ రాజేష్ నాయక్, సిబ్బందితో వడ్లకొండ బైపాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. జల్సాలకు అలవాటుపడి వాహనాలు దొంగిలిస్తున్నట్టు అంగీకరించారు. నిందితుల నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పరచనున్నట్టు సీఐ తెలిపారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేష్ నాయక్ సహా సిబ్బందిని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ అభినందించారు.






