ప్రియుడితో గదిలో భార్య.. చితక్కొట్టిన భర్త.. విషాదం

250

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కుసుమ నాగసాయి(30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందిన వ్యక్తితో పెళ్లయింది. పెళ్లికి ముందే నాగసాయి ఏలూరు గన్‌బజార్‌కు చెందిన షేక్‌ నాగూర్‌ (28)ని ప్రేమించింది. నాగసాయికి పెళ్లైన తర్వాత కూడా వీరి మధ్య బంధం అలాగే కొనసాగుతుంది. ప్రియుడు నాగూర్‌ మధ్యమధ్యలో నిడదవోలు వచ్చి ఆమెను కలిసి వెళ్లేవాడని స్థానికులు చెప్తున్నారు. ఆదివారం కూడా నాగూర్ తాళ్లపాలెం వచ్చాడు. అయితే వీరిద్దరూ కలిసేందుకు నాగసాయికి తెలిసిన బంధువు ఒకరు గది ఇచ్చారు.

భార్య తన ప్రియుడితో కలిసి ఉందన్న విషయ తెలుసుకున్న భర్త గ్రామస్థులతో కలిసి ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గ్రామస్థులతో కలిసి చితక్కొట్టాడు. శెట్టిపేటలోని తమ బంధువుల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు ఆనుకుని ఉన్న గదిలో బంధించారు. అయితే అక్కడే వాళ్లిద్దరూ గదిలో ఉన్న ఎలుకల మందు మింగారు. కొద్దిసేపటికి గదిలో చూడగా నాగసాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. అటు నాగూర్‌ కూడా మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయంతో వారే ఎలుకల మందు తిన్నారా.. లేదా వేరే ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..