- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10 తులాల బంగారం చోరీ.. అలా తిరుగుతూ దొరికిపోయిన దొంగలు
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలంలోని బస్టాండులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు శనివారం ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. వివరాల్లోకివెళితే.. మండల పరిధిలోని మునిపల్లి, లక్ కోర, అక్సాపూర్ గ్రామాల్లోని ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడి దాదాపు 10 తులాల బంగారాన్ని దొంగిలించినట్టు నేరస్తులు అంగీకరించారు. నిందితుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ దొంగలు మహారాష్ట్రలోని ఉమ్రి ప్రాంతానికి చెందిన […]</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలంలోని బస్టాండులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు శనివారం ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. వివరాల్లోకివెళితే.. మండల పరిధిలోని మునిపల్లి, లక్ కోర, అక్సాపూర్ గ్రామాల్లోని ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడి దాదాపు 10 తులాల బంగారాన్ని దొంగిలించినట్టు నేరస్తులు అంగీకరించారు. నిందితుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ దొంగలు మహారాష్ట్రలోని ఉమ్రి ప్రాంతానికి చెందిన వారుగా ఎస్ఐ తెలిపారు. నిందితులను చాకచక్యంతో పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఏసీపీ వెంకటేష్ అభినందించారు.
- Tags
- gold stolen
Next Story






