సమాధిలో కౌగిలించుకుని ఉన్న ఆడ, మగ ‘అస్థి పంజరాలు’.. ఎక్కడంటే!

by  |
సమాధిలో కౌగిలించుకుని ఉన్న ఆడ, మగ ‘అస్థి పంజరాలు’.. ఎక్కడంటే!
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఒకే సమాధిలో చనిపోయిన ఇద్దరిని పూడ్చిపెట్టడం ఈ రోజుల్లో చాలా అరుదు. అదికూడా ఒక ఆడ మరియు మగ శవాలను ఖననం చేయడం అసాధ్యం. అలాంటివి ఈ మధ్య కాలంలో జరిపిన పురాతన తవ్వకాల్లో బయటపడితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే చైనాలో వెలుగుచూసింది. ఒకే సమాధిలో ఆడ, మగ ఇద్దరి అస్థి పంజరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. అవి 1500 సంవత్సరాల నాటివని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

వివరాల్లోకివెళితే.. ఇటీవల చైనాలోని ఓ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతుండగా.. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఉన్న రెండు అస్థి పంజరాలు బయటపడ్డాయి.అవి ఉత్తర వెయి రాజవంశానికి చెందినవని.. వారు చనిపోయినప్పుడు ఉమ్మడిగా ఖననం చేసినట్టు నిర్దారించారు. మరణ సమయంలో ఆ వ్యక్తి వయస్సు 29 నుంచి 35 మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. మహిళ మాత్రం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య చనిపోయి ఉండవచ్చని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అయితే, ఈ అస్థిపంజరాలను ఇలా ఉమ్మడిగా ఎందుకు ఖననం చేసి ఉంటారనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని వారు తెలిపారు.


Next Story

Most Viewed