- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు దొంగలు అరెస్ట్.. 5 ఆటోలు స్వాధీనం
<p>దిశ, శంషాబాద్: ఆటోలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో చోరీకి గురైందని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని, విచారణలో భాగంగా రాజేంద్ర నగర్ డీఐ పవన్ కుమార్, ఎస్ఓటీ ఎస్సై రాజేష్ రెడ్డిలు కలిసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు […]</p>

దిశ, శంషాబాద్: ఆటోలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో చోరీకి గురైందని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశామని, విచారణలో భాగంగా రాజేంద్ర నగర్ డీఐ పవన్ కుమార్, ఎస్ఓటీ ఎస్సై రాజేష్ రెడ్డిలు కలిసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరిని విచారించగా అసలు విషయం బయపడిందని తెలిపారు. ఈ ఇద్దరు కలిసి ఆరు ఆటోలను చోరీ చేశారని తెలిపారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో రెండు ఆటోలు, నాంపల్లిలో ఒకటి, ఆసీఫ్ నగర్ లో ఒకటి, ఉమాయన్ నగర్ లో ఒకటి, సీసీఎస్ లో ఒక ఆటోను వారు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.

- Tags
- Arrest






