ఇంట్లో గంజాయి విక్రయాలు.. మహిళ అరెస్ట్

by Batti.Sumithra |

ఫతేనగర్ ప్రాంతంలో ఇంటి నుంచే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఇంట్లో గంజాయి విక్రయాలు.. మహిళ అరెస్ట్
X

దిశ, బాలానగర్ : ఫతేనగర్ ప్రాంతంలో ఇంటి నుంచే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 620 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వానిక (40) అనే మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితురాలిని మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటన పై కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story