- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
27న జర్నలిస్టుల ఛలో పార్లమెంట్.. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలపై ఈ నెల 27వ తేదీన పాత్రికేయుల ఛలో పార్లమెంట్" కార్యక్రమం చేపట్టనున్నారు.

దిశ, హిమాయత్ నగర్: కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలపై ఈ నెల 27వ తేదీన "తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో "పాత్రికేయుల ఛలో పార్లమెంట్" కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ లు తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదర్గూడ లోని ఎన్ఎస్ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జర్నలిస్టుల "ఛలో పార్లమెంట్‌కు సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్దరణ, జర్నలిస్టుల రక్షణకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయడం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాకు చట్టబద్దత తదితర డిమాండ్ల సాధనకై 27న ఢిల్లీలోని పార్లమెంట్ (జంతర్ మంతర్) వద్ద ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నా అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, రవికుమార్, అశోక్ కుమార్, రవి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.






