కంగ్టి కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

by Taduka Kalyani |

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) కంగ్టిలో ఖాళీగా ఉన్న హిందీ, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి సీహెచ్ విజయలక్ష్మి తెలిపారు.

కంగ్టి కేజీబీవీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, కంగ్టి: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) కంగ్టిలో ఖాళీగా ఉన్న హిందీ, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి సీహెచ్ విజయలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల అసలు ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోపు కేజీబీవీ కంగ్టిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలకు 95054 14708 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా కేజీబీవీలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ (సీజీటీ) కోర్సులో ఇంకా 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు స్పాట్ అడ్మిషన్ల ద్వారా వెంటనే ప్రవేశం పొందవచ్చని, మరిన్ని వివరాలకు 86393 24086 నంబర్‌ను సంప్రదించాలని ప్రత్యేక అధికారి కోరారు.

Next Story