కల్తీకల్లుకు ఇద్దరు బలి.. 40మందికి అస్వస్థత

35

దిశ, వెబ్‌డెస్క్: కల్తీకల్లు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామంలో కల్లు తాగిన వారంతా కళ్లు తిరిగి కింద పడిపోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా.. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. చిట్టిగిద్దకు గ్రామానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్లు కాంపౌండ్‌ను అధికారులు సీజ్ చేశారు.