అతివేగం.. తీసింది ఇద్దరి ప్రాణం

by Shyam |   (  Updated:2021-06-24 02:32:31  IST  )

<p>దిశ, మక్తల్: మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణ మండలం గుడాబలూరు వద్ద రాయచూరు వైపు నుండి వేగంగా వస్తున్న కారు మక్తల్ నుండి రైచూర్ వైపు వెళ్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు [&hellip;]</p>

road accident news
X

దిశ, మక్తల్: మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణ మండలం గుడాబలూరు వద్ద రాయచూరు వైపు నుండి వేగంగా వస్తున్న కారు మక్తల్ నుండి రైచూర్ వైపు వెళ్తున్న మరో కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతులలో ఒకరు మహబూబ్ నగర్ కు చెందిన వారు కాగా, మరొకరు గుడబలూరుకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Next Story