- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరుగుబిల్లి మండలం రావివలస దగ్గర వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు బైక్‌లు దగ్ధం అయ్యాయి. మృతుల స్వస్థలం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరుగుబిల్లి మండలం రావివలస దగ్గర వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు బైక్‌లు దగ్ధం అయ్యాయి. మృతుల స్వస్థలం రావివలసగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






