- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహేతర సంబంధం… తీసింది ఇద్దరి ప్రాణం
<p>దిశ, నిజామాబాద్: వివాహేతర సంబంధాలు.. కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలుకు అదే గ్రామానికి చెందిన శైలజ అనే మహిళతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. దీని కారణంగానే వారి ఇళ్లలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26 న సాయిలు, శైలజ ఇద్దరు కలిసి బైక్ పై […]</p>

దిశ, నిజామాబాద్: వివాహేతర సంబంధాలు.. కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలుకు అదే గ్రామానికి చెందిన శైలజ అనే మహిళతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. దీని కారణంగానే వారి ఇళ్లలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26 న సాయిలు, శైలజ ఇద్దరు కలిసి బైక్ పై సికింద్రాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అనంతరం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శనివారం స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు చిత్తూరి సాయిలు హనుమాన్ మాలలో ఉండి, ఆత్మహత్యకు పాల్పడడం విచారకరమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






