- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం కిక్కులో పామును అలా చేశారు.. తర్వాత ఏమైదంటే ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితే మాకు మేమే మహా రాజులం అనే పాట అందరూ వినే ఉంటారు. అయితే ఇలా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తాము మహారాజులనుకున్నారో ఏమో తెలియదు కానీ, మద్యం మత్తులో వారు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. బాగా తాగి ఏమాత్రం సృహ తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. ఇక, తాగుతూ ఊగుతూ వస్తుంటే దారిలో కలసిన పామును తినేశారు. ఈ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితే మాకు మేమే మహా రాజులం అనే పాట అందరూ వినే ఉంటారు. అయితే ఇలా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తాము మహారాజులనుకున్నారో ఏమో తెలియదు కానీ, మద్యం మత్తులో వారు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. బాగా తాగి ఏమాత్రం సృహ తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. ఇక, తాగుతూ ఊగుతూ వస్తుంటే దారిలో కలసిన పామును తినేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కోర్బాలో రాజు, హితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం తాగారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన సగం కాలి, చనిపోయిన పాము కనిపించింది. అయితే పామును చూసిన వారు అది బతికే ఉందనుకోని, అది ఎవరింటిలోకైనా వెళ్లితే ఎలా అనుకున్నారు. ఎవరినైనా కాటేస్తుందని భావించిన వారు ఏకంగా దాన్ని తినేశారు. కానీ, అప్పటికే ఆ పాము సగం కాలి చనిపోయింది. అది గమనించని వారు పామును తినేశారు. తిన్నాక కొద్ది సేపటికి తల తిరగటంతో దాన్ని అక్కడే కక్కారు. అలాగే సృహ కోలిపోయి పడిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.






